భాగం 1, భాగం 2 లో చూసినట్టు, 10 కోట్ల కుటుంబాలకి 5 లక్షల బీమాను ఇచ్చే స్కీం అయిన జాతీయ ఆరోగ్య సంరక్షణ స్కీం, ప్రాథమికంగా పన్ను కట్టేవారినుంచి పేదవారికి ప్రభుత్వం ద్వారా డబ్బుల్ని రవాణా చేసే పథకం. దీనివల్ల బిజెపి నేరుగా ఎన్నికల లాభాలను పొందుతుంది. దీనికి చేసే భారీ ఖర్చుల ప్రభావం వచ్చే ఏళ్ళలో ఎప్పుడో కన్పిస్తుంది, కానీ ఆ పాటికి లోక్ సభ ఎన్నికలు అయిపోతాయి, ఫలితాలు వచ్చేస్తాయి. అయితే, ఆరోగ్యకరమైన భారతీయులను తయారుచేసే ఆశయాన్ని ఎలా సాధించాలి?